![]() |
Rythu Bharosa |
తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయం అందజేసేందుకు ప్రారంభించబోయే రైతు భరోసా పథకంలో అనేక మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా పెట్టుబడి సహాయం అందజేయడానికి టెక్నాలజీని ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుగాను ప్రత్యేక వెబ్ సైట్ లేదా యాప్ ను అందుబాటులోకి తేవాలని భావిస్తుంది.
OIN What's Group Link: Click Here
రైతు భరోసా పథకంలో అనేక మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా పెట్టుబడి సహాయం అందజేయడానికి టెక్నాలజీని ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుగాను ప్రత్యేక వెబ్ సైట్ లేదా యాప్ ను అందుబాటులోకి తేవాలని భావిస్తుంది.
అదే విధంగా రైతుల నుంచి ఆన్లైన్ లో ధరఖాస్తులు తీసుకోవాలనే ప్రతిపాదనపై ఆలోచిస్తుంది. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతు భరోసా పై రెండు గంటలకు పైగా చర్చ కొనసాగింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పంపిణీ చేయాలని నిర్ణయించారు. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.
ఎలాంటి చిక్కులు లేకుండా కేవలం రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్, ఫోన్ నెంబర్ వివరాలతో ఆన్లైన్ లో అప్లికేషన్ పెడితే ఎలా ఉంటుందనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించారు.
అదే విధంగా ఒక వెబ్ సైట్ గాని ప్రత్యేక యాప్ ను గాని తీసుకురావాలని ప్రభుత్వానికి రికమండ్ చేయాలని సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. దానివల్ల ప్రజాప్రతినిధులు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు, ఇతర బిజినెస్ వారు రైతు భరోసా కు దరఖాస్తు చేసుకుంటారా..? లేదా..? అనేది తేలనున్నది.
గతంలో రైతుబంధు కోసం పెట్టిన "గివ్ ఇట్ అప్" అనేది పెద్దగా ఉపయోగ లేకుండా పోయింది. ఈసారి రైతు భరోసా పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు దరఖాస్తు చేసుకున్న భూములలో కొండలు, గుట్టలు, రహదారులు, సాగుకు యోగ్యం కానివి ఉంటే పరిశీలించనున్నారు..
అయితే కేవలం రైతులు దరఖాస్తు చేసుకున్న విధానంతోనే కాకుండా శాటిలైట్ టెక్నాలజీని వాడుకోనున్నారు. సీజన్ ప్రారంభమైన తర్వాత పెట్టుబడి సహాయం అందజేస్తున్నందున అంతకుముందు సీజన్ లో ఉన్న శాటిలైట్ ఇమేజ్ లను పరిగణలోకి తీసుకుంటారు. దాంతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాలలో ఫీల్డ్ సర్వే చేపట్టి పంటలు వేశారో..? లేదో..? చెక్ చేయనున్నారు.
రైతు భరోసా పథకాన్ని కేవలం సాగుభూములకే అందజేయాలని పంటలు సాగు చేస్తున్న రైతులకు మాత్రమే పంట సహాయం అందించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. దాంతో టెక్నాలజీని ఉపయోగించడంతోపాటు మాన్యువల్ గా కూడా పరిశీలించిన తర్వాతనే రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు.
ఇది ఇలా ఉండగా రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దే ఫైనల్ నిర్ణయం కానున్నది. ఎక్కువగా ఏడున్నర ఎకరాల వరకు రైతు భరోసా అందజేయాలని సిఫార్సులు వచ్చినట్లు సమాచారం. రైతు భరోసా విధివిధానాల ఖరారుపై క్యాబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
JOIN What's Group Link: Click Here
OTHER POSTS: