![]() |
RYTHU BHAROSA 2025 |
రైతు భరోసా పథకిం కింద రైతులకు ఈనెల 26 వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నట్టు ఉత్తర్వుల్లో (జీవో ఆర్టీ నంబర్ 18 / తేదీ 10-01-2025) పేర్కొంది. రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో జీవో జారీ చేసిన ప్రభుత్వం.. రైతు భరోసా జీవోను కూడా తెలుగులో వెలువరించింది.
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పంట పెట్టుబడి సాయం అందుతుందని ప్రక టించింది. డీబీటీ (DBT) విధానంలో డబ్బులను జమ చేస్తారు.
రైతు భరోసా మార్గదర్శకాలు వచ్చేశాయ్. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. జనవరి 26వ తేదీ నుంచి ఈ స్కీమ్ ప్రారంభమవుతుందని ప్రకటించింది. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పంట పెట్టుబడి సాయం అందుతుందని తెలిపింది. అర్హత లేని భూములకు రైతు భరోసా ఇవ్వరని స్పష్టం చేసింది.
ఎకరాకు రూ. 12 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తామని మార్గదర్శాల్లో పేర్కొంది. ఆర్వోఎస్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులవుతారని స్పష్టం చేసింది. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు వివరించింది.
రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల - కీలక అంశాలివే: CLICK HERE
కీలక అంశాలు:
- రైతు భరోసా స్కీమ్ జనవరి 26, 2025వ తేదీ నుంచి అమలు చేస్తారు.
- రైతు భరోసా స్కీమ్ కింద ఎకరాకు రూ. 12000 పంట పెట్టుబడి సాయం అందిస్తారు.
- భూభారతి(ధరణి)లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పంట పెట్టుబడి సాయం అందుతుంది. అర్హత లేని భూములను తొలగిస్తారు.
- ఆర్వోఎస్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులవుతారు.
- డీబీటీ (నగదు బదిలీ) పద్ధతిలో రైతు భరోసా సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
- ఎన్ఐసీ, హైదరాబాద్ వారు ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.
- రైతు భరోసా స్కీమ్ ను వ్యవసాయశాఖ సంచాలకులు అమలు చేస్తారు.
- జిల్లా కలెక్టర్లు పథకం అమలును పర్యవేక్షిస్తూ, సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి బాధ్యులుగా ఉంటారు.
ఇక రైతు భరోసా స్కీమ్ ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం... సీలింగ్ విషయాన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. తొలి నుంచి ఈ పథకం అమలులో సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఉత్కంఠను రేపింది. గతంలో ఉన్న రైతుబంధు పథకం అమలులో అనేక లోపాలు ఉన్నాయని.. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. గతంలో మాదిరిగా స్కీమ్ అమలు ఉండదని... సాగు యోగ్యత ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తామని కూడా క్లా ఇచ్చింది.
నిజానికి రైతు స్కీమ్ అమలుపై ప్రాథమికంగా కొన్ని సందేహాలు తెరపైకి వచ్చాయి. ఇందులో సీలింగ్ అంశం కూడా ఒకటిగా ఉంది. గతంలో అమలు చేసిన రైతుబంధు పథకం కింద ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా.. పంట పెట్టుబడి సాయం అందించారు. ఎలాంటి సీలింగ్ ను కూడా నిర్ణయించలేదు. దీంతో రైతుకు ఎంత విస్తీరణంలో భూమి ఉందో.. అంతమేరకు పంట సాయం అందింది. అయితే రైతు భరోసా స్కీమ్ లో సీలింగ్ ఉంటుందనే చర్చ జోరుగా జరిగింది. అయితే అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించలేదు. దీంతో సాగు యోగ్యత ఉండే ఎన్ని ఎకరాలకైనా పంట పెట్టుబడి సాయం అందటం ఖాయమనే అర్థమవుతోంది.