MUTUAL FUND: HDFC స్కీమ్.. కనీసం రూ. 100 ఉన్నా చాలు..

globalinfo9
By -
0

HDFC Large Cap Fund: రూ. 100 ఉన్నా చాలు.. 


HDFC Mutual Fund

HDFC Top 100 Fund: 

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ కీలక ప్రకటన చేసింది. తన టాప్ 100 ఫండ్ పేరును మార్చేసింది. ఇప్పుడు అది హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ ఫండ్‌గా మారుతుందని స్పష్టం చేసింది. వచ్చే సంవత్సరం నుంచి ఇది అమలవుతుందని వెల్లడించింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ కోసం.. లార్జ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు చేస్తుందని.. అందుకే పేరు మార్చినట్లు తెలిపింది. ఈ స్కీం పూర్తి వివరాలు తెలుసుకుందాం.


HDFC Large Cap Fund: 

మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ వస్తాయన్న అంచనాతో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా మంచి లాభాలు వస్తాయి. ఆరంభ సంవత్సరాల్లో పెద్దగా రిటర్న్స్ రాకపోయినా.. కాలం గడుస్తున్న కొద్దీ లాభాలు పెరుగుతుంటాయి. ఇక్కడ వడ్డీపై వడ్డీ, అసలుపై వడ్డీ వల్ల మంచి రాబడి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. ఇక్కడ కూడా మన డబ్బుల్ని పరోక్షంగా.. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే. అయితే వేర్వేరు స్టాక్స్‌లో ఒకే ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి రిస్క్ కాస్త తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం HDFC మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక బెస్ట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం.


అదే హెచ్‌డీఎఫ్‌సీ TOP 100 Fund. దీనిపై తాజాగా కీలక ప్రకటన వచ్చింది. ఈ ఫండ్ పేరు హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ ఫండ్ అని మారుతున్నట్లు ప్రకటించింది. 2025, జనవరి 1 నుంచి ఈ మార్పు నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇప్పటికే దీని గురించి.. యూనిట్ హోల్డర్స్‌కు నోటీసులో వెల్లడించింది.


హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 100 ఫండ్.. అనేది ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. ఎక్కువ మొత్తం లార్జ్ క్యాప్ స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెడుతుంటుంది. నిఫ్టీ 100 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ (TRI) ఇక్కడ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌గా ఉంది. ఈ ఫండ్ మేనేజర్లుగా రాహుల్ బైజాల్, ధ్రువ్ ముచ్చల్ ఉన్నారు. దీర్ఘకాలంలో మంచి లాభాలు కోరుకునే వారికి ఈ స్కీమ్ సెట్ అవుతుందని చెబుతున్నారు. ఇందులో 80 నుంచి 100 శాతం వరకు ఈక్విటీ, లార్జ్ క్యాప్ కంపెనీస్‌కు చెందిన ఈక్విటీ రిలేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు కేటాయించగా.. 0-20 శాతం వరకు ఇతర లార్జ్ క్యాప్ కంపెనీలకు వర్తిస్తుంది. ఇంకా స్వల్ప మొత్తం డెట్ సెక్యూరిటీల్లో, REITs లో కూడా ఉంది.


ఈ ఫండ్‌లో కనీసం రూ. 100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్టంగా పరిమితి లేదు. గత ఏడాది వ్యవధిలో ఇది సగటున 13.90 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 11.75 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ ఫండ్ నికర ఆస్తుల విలువ (AUM) రూ. 36587.24 కోట్లుగా ఉంది. ఇది నవంబర్ 30 వరకు డేటా ప్రకారం మాత్రమే. ఇక ఈ స్కీమ్ ప్రారంభించిన (1996) సమయంలో నెలకు రూ. 10 వేల సిప్ ప్రారంభించినట్లయితే.. ఇప్పటివరకు అది రూ. 8.83 కోట్లు అయ్యేది. సగటున ఇన్నేళ్లలో 18.75 శాతం రాబడి అందించింది.


What's App Group Link: Click Here


Disclaimer: 

We are not SEBI Registered Advisors. This website is purely for training and educational purposes. We shall not be responsible for your profit or loss. Please confirm with your investment advisor.


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn more
Ok, Go it!