Jio Coin గురించి తెలుసా?
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫారమ్‌లు పాలిగాన్(Polygon) బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లో JioCoin అనే కొత్త రివార్డ్ టోకెన్‌ను ప్రారంభించినట్లు నివేదించబడింది. టోకెన్ యొక్క కార్యాచరణ గురించి కంపెనీ ఇంకా అధికారిక వివరాలను వెల్లడించనప్పటికీ, లాంచ్ దాని సంభావ్య ఉపయోగాలపై చర్చలకు దారితీసింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలోని వినియోగదారులు Jio యొక్క యాజమాన్య వెబ్ బ్రౌజర్ అయిన JioSphereలో దాని ఏకీకరణను గమనించారు. సోషల్ మీడియా వినియోగదారు టోకెన్ JioSphere, Jio యొక్క వెబ్ బ్రౌజర్‌లో విలీనం చేయబడిందని మరియు ఆన్‌లైన్‌లో బ్రౌజింగ్ చేసినందుకు వినియోగదారులకు రివార్డ్‌లు
భారతీయ స్టాక్ మార్కెట్లో(Stock Market) రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. సెక్యూరిటీ మార్కెట్తో పాటు, క్రిప్టో కరెన్సీ (Crypto currency) కి మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఆధునిక యుగంలో డిజిటల్ కరెన్సీ వినియోగం భారీగా పెరిగిందనే చెప్పవచ్చు. దీంతో క్రిప్టో జోష్ కూడా పెరిగింది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ(Crypto currency) విలువ భారీగా పెరిగింది. ఒక కాయిన్ విలువ లక్ష డాలర్ల మార్క్ దాటేసింది. దీన్ని బట్టి క్రిప్టో కరెన్సీకి ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతోంది.
అయితే భవిష్యత్తులో వర్చువల్ కరెన్సీకి ఉన్న డిమాండ్ ను పరిగణలోనికి తీసుకుని భారతీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇందులోకి అడుగుపెట్టింది. జియో కాయిన్ పేరుతో క్రిప్టో కరెన్సీని తమ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.
పాలిగాన్ ల్యాబ్స్ (Polygon Labs)తో జియో ప్లాట్ఫారమ్ల భాగస్వామ్యం క్రిప్టోలోకి రిలయన్స్ ప్రవేశంగా పరిగణిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్ఫారమ్లు ఇటీవల ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. టెలికాం కంపెనీ ఈ ప్రకటన చేసినప్పటి నుండి Polygon Labs 'JioCoin ఇంటర్నెట్లో చర్చలను వేడెక్కించింది.
పాలిగాన్ ల్యాబ్స్ తో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి అనుకూలమైన వెబ్(Webe3) 3 తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న రిలయన్స్ జియో కాయిన్(jiocoin) ను ఇప్పుడు పరిచయం చేస్తోంది. ఈ బ్లాక్ చెయిన్(Blockchain) ఆధారిత రివార్డ్ సిస్టమ్ ద్వారా యూజర్లను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
జియోకాయిన్ ఎలా పొందాలి?
వినియోగదారులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్(Google Play Store) లోకి వెళ్లి అధికారిక జియో స్పేర్ బ్రౌజర్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇన్ స్టాలేషన్ తర్వాత యూజర్లు ఇప్పుడు జియో కాయిన్ సంపాదించడానికి సైన్ ఇన్ చేయండి అని ప్రాంప్ట్ చేసే పాప్ అప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. దీన్ని సైన్ అప్ ప్రక్రియకు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తోపాటు పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
సైన్ అప్(Sign up) ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ లో జియో కాయిన్ వాలెట్ (Jio Coin Wallet) క్రియేట్ అవుతుంది. యూజర్లు వారి రివార్డ్ టోకెన్స్ మానిటర్ లేదా మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా రిజిస్టర్ చేసుకున్న అనంతరం యూజర్లు జియో యాప్ తో స్పెషల్ టాస్క్ కంప్లీట్ చేసి ఈ కాయిన్స్ తీసుకోవచ్చు. అంటే జియో యాప్స్ ఎక్కువగా ఉపయోగించేవారు ఈ జియో కాయిన్ టోకెన్స్ పొందవచ్చు. అయితే ఈ కాయిన్ ను ఎలా వినియోగించాలో ఇప్పటి వరకు రిలయన్స్ వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.