LIC Scholarship: Scheme -2024
ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతున్న పేద విద్యార్థులకు గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీం-2024 పేరిట 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ఉపకారవేతనాన్ని అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు డిసెంబర్ 22లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీం-2024
1. అర్హత:
జనరల్ స్కాలర్షిప్: 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం
మార్కులతో టెన్త్/ ఇంటర్/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 మించకూడదు. 2024-25 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు/ కళాశాలలు/ సంస్థల్లో ఏదైనా ఇంటర్, డిగ్రీ, మెడిసిన్, ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్, డిప్లొమా, వృత్తి విద్య లేదా తత్సమానమైన కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనం అందుతుంది.
2. స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్:
పదో తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి
ఇది ఉద్దేశించింది. 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 మించకూడదు. 2024-25 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ సంస్థల్లో ఇంటర్మీడియట్, ఒకేషనల్, డిప్లొమా, ఐటీఐ కోర్సు అభ్యసిస్తున్న బాలికలకు ఉపకారవేతనం అందుతుంది.
3. అందే సాయం:
జనరల్ స్కాలర్షిప్నక్కు మెడిసిన్ (ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్) విద్యార్థులకైతే ఏటా రూ.40వేలు ఇస్తారు.
రెండు విడతల చొప్పున ఏడాదికి రూ.20,000 అందుతుంది. ఇంజినీరింగ్ (బీఈ, బీటెక్, బీఆర్క్) విద్యార్థులైతే ఏడాదికి రూ.30వేలు ఇస్తారు.
రెండు విడతల్లో రూ.15,000 చొప్పున చెల్లిస్తారు. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్ కోర్సులు చేసేవారికైతే ఆ కోర్సు పూర్తయ్యేవరకు ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తారు. ఈ మొత్తాన్ని రెండు విడతల్లో రూ.10,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్, ఒకేషనల్/ డిప్లొమా కోర్సులను పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని రెండు విడతల్లో 7,500 చెల్లిస్తారు.
4. ఎంపిక విధానం:
కనీస అర్హతగా పేర్కొన్న టెన్త్ లేదా ఇంటర్లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్ షిష్నకు ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయ వర్గాలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.
5. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-12-2024.
HOW TO APPLY: